వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ….
కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ
కలసి మెలసి – భువిలో దివిలో
ఇలలో సత్యము మొలకై నిలచెను
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ
నిత్యుడైన – తండ్రి దేవుడు
నీతి సూర్యుడు – భువినుదయించెను
పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ
కరము చాచి – కనికరించి
మరు జన్మములో మనుజుల మలచే