వర్ణించలేను వివరించలేను
అతి శ్రేష్టమైన నీ నామమున్
యేసు నీ నామమున్
కొనియాడెదన్ కీర్తించెదన్
అత్యంతమైన నీ ప్రేమను
యేసు నీ ప్రేమను
మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే
పాపినేని చూడక ప్రేమించితివే
హల్లెలూయా హల్లెలూయా
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా
సర్వాధికారి సర్వోన్నతుడా
హీనుడైన నన్ను కరుణించితివే
హల్లెలూయా హల్లెలూయా
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా
రత్న వర్ణుడవు అతి సుందరుడవు
నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే
హల్లెలూయా హల్లెలూయా
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా