యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ

అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటిని భరియించిరి
ఆత్మలు రక్షించిరి
|| యేది ||

అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి
|| యేది ||

ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి
|| యేది ||

ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు
|| యేది ||

కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి
|| యేది ||

www.christsquare.com