యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయె నేను ఎవరికి ఎన్నడు భయపడను
నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను
ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము