యవ్వనుడా యవ్వనుడా - ఈ లోకం చెడ్డదిరా
ఇప్పుడైనా ఇప్పుడైనా - నీ కళ్ళు తెరువరా ||2||
పాపం పాము వంటిదిరా పగబట్టి నిన్ను తరుమునురా
కాటు వేయక మానదురా ఎవరిని అది వదలదురా ||2||
ఏమాయను సంసోను - వ్యభిచార మత్తులో ముగిసెనురా
రెండు కళ్ళు కోల్పోయెను - దైవాభిషేకం పోయెనురా (2)
బలవంతుడే బలియైనాడు - యోచించు నీ గతి ఏమోనో (2)
తప్పిపోయిన తనయుడు - తండ్రి ప్రేమను విడిచెను
సర్వము కోల్పోయిన - దీనస్థితికి దిగిజారెను (2)
యేసు ప్రేమను విడిచిపోతే యోచించు నీ గతి ఏమోనో (2)
పాపము నుండి పారిపోరా - ఈ లోక స్నేహం విడిచిపోరా
యోసేపులా నీవుండురా - జారత్వము విడిచిపోరా(2)
ఫలించుడి కొమ్మగా ఉండరా - అందరికీ (ప్రజలందరికీ)మాదిరిగా ఉండురా (2)
యవ్వనుడా యవ్వనుడా - ఈ లోకం చెడ్డదిరా ,O Yavanuda ,యవ్వనుడా యవ్వనుడా - ఈ లోకం చెడ్డదిరా , O Yavanuda Lyrics Song Chords PPT -యవ్వనుడా యవ్వనుడా - ఈ లోకం చెడ్డదిరా