పల్లవి:- నా నోటినిండా నవ్వుండును
ఆనందగానము నే చేసెదను
చెర నుండి సీయోనుకు సాగుతుంది నా ప్రయాణము // నా నోటినిండా //
1. ఒంటరిగా నేనున్నపుడు-
ఎవరు లేరనుకున్నప్పుడు
హక్కున చేర్చుకున్నావు-
నేనున్నానని అన్నావు //2//
వివరించలేనయ్య వర్ణించలేనయ్య
నీ ప్రేమకై పాదాభివందనం
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ ప్రేమకై పాదాభివందనం-నీ జాలికై పాదాభివందనం // నా నోటినిండా //
2. అర్హతలేని నా కొరకు -
పరమును విడిచివచ్చావు
నా దోషములన్ని కడిగి -
నన్ను శుద్ధుని చేసావు
నాకు ధైర్యమిచ్చావు- నిరీక్షణనిచ్చావు
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికైపాదాభివందనం
// నా నోటినిండా//
None
None
None
None
None