ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం
ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం
ఏ కాలమైనా - కారు మేఘమైనా
ఏ లోయలైనా - శోక సంద్రమైనా
నీవేగా ఆధారం - నీవే కదా మార్గం
1. మరువలేని - గాయమైన
నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా
విసిగివున్న - జీవితాన
ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా
తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన
కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
2. కపటమైన లోకమందు
నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా
మధురమైన మమత చూపి
తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా
కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన
తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
None
None
None
None
None
Idhe Kadha Jeevitham lyrics, Latest Telugu Christian Song lyrics Download Christsquare.com,Idhe Kadha Jeevitham ,ఇదే కదా జీవితం